చుక్కల చున్నికే నా గుండెని కట్టావే
ఆ నీలాకాశంలో అరే గిర్ర గిర్ర తిప్పేసావే
మువ్వల పట్టికే నా ప్రాణం చుట్టవే
నువ్వెళ్లే దారంతా
అరె ఘల్లు ఘల్లు మోగించావే

వెచ్చా వెచ్చని ఊపిరితోటి
ఉక్కిరి బిక్కిరి చేసావెే
ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయరయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే ఘల్లంతయ్యా

ఏయ్ కొత్త కొత్త చిత్రాలన్నీ
ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగ దాచుకో లేను
డప్పే కొట్టి చెప్పాలేను

పట్టలేని ఆనందాన్ని
ఒక్కడినే మొయ్యా లేను
కొద్దిగా సాయం వస్తే
పంచుకుందాం నువ్వు నేను

కాసేపు నువ్వు కన్నార్పకు
నిన్నులో నన్ను చూస్తునే వుంటా
కాసేపు నువ్వు మాట్లాడకు కౌగిళ్ల కావ్యం రాసుకుంట

ఓ ఎడారిలా ఉండే నాలో
సింధు నదై పొంగావే
ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయరయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే ఘల్లంతయ్యా

బాధనే భరించడం
అందులోంచి బయటకి రాడం
చాల చాల కష్టం అని
ఏంటో అంతా అంటుంటారే

వాళ్ళకి తెలుసు లేదో
హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా
అందుకు నేనే సాక్ష్యం కదా

ఇంతలా నేను నవ్వింది లేదు
ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంక లాగా
మనసేనాడు ఊగలేదు

ఏ దాయీ దాయీ అంటూ ఉంటే
చందామామై వచ్చావే
ఉండిపో ఉండిపో తొడుగా నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయరయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే ఘల్లంతయ్యా

Song Credits:
Song Name: Chukkala Chunni
Movie Name: S.R. Kalyanamandapam
Music Director: Chaitan Bharadwaj
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Singer: Anurag Kulkarni