చిట్టి నీ నవ్వంటే
లక్ష్మీ పటాసే
ఫట్టుమని పేలిందా
నా గుండె ఖల్లాసే
అట్ట నువ్వు గిర్రా.. గిర్రా..
మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యావని
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే

వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే
చిమ్మ చీకటిగున్న జిందగిలోనా
ఫ్లడ్ లైట్ ఏసావే
హత్తేరి నచ్చేసావే
మస్తుగా నచ్చేసావే
బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని
లోకం లోన రంగులు పూసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చిల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే

చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్‌బుల్ చిట్టి
నా ఫేసుబుక్ లో లక్ష
లైకు లు కొట్టావే

యుద్ధమేమి జరగలే
సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అల చిన్న నవ్వుతో
పచ్చ జండ చూపించినావే
మేడమ్ ఎలిజబెత్తు నీ రేంజ్ ఐనా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా

మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీ కి ఫ్లైట్ ఏసావే
తీన్మార్ చిన్నోడిని
DJ స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బ్యాడ్ ఉన్నోడిని
నవాబ్ చేసేస్తివే
అతిలోక సుందరి నువ్వు
ఆఫ్టరాల్ ఓ టప్పోరి నేను
గూగుల్ మ్యాపై
నీ గుండెకి చేరిస్తివే

అరెరే ఇచ్చాసావే
దిల్లు నాకు ఇచ్చాసావే
మిర్చి బజ్జీ లాంటి
లైఫ్ లొ ఆనియన్ వేసావే
అరెరే గుచ్చేసావే
లవ్ టాటూ గుచ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో
నింబు చక్కై హల్చల్ చేసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చిల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే

చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్‌బుల్ చిట్టి
నా ఫేసుబుక్ లో లక్ష
లైకు లు కొట్టావే

Song: Chitti
Movie: Jathi Ratnalu
Singer: Ram Miriyala
Music Director: Radhan
Lyricist: Ramajogayya Sastry
Music Label: Lahari Music