నాలోనే పొంగెను నర్మద
నీళ్ళల్లో మురిసిన తామర
అంతట్లో మారేను ఋతువుల
పిల్లా నీవల్లా..

నీతో పొంగె వెల్లువ
నీళ్ళల్లో ఈదిన తారక
బంగారు పువ్వుల కానుక
పెరెలే కాంచన

ఓ శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే

నాలోనే పొంగెను నర్మద
నీళ్ళల్లో మురిసిన తామర
అంతట్లో మారేను ఋతువుల
పిల్లా నీవల్లా..

ఏదో ఒకటి నన్ను కలచి
ముక్కు చివరి మర్మమొకటి
కల్లా కపటం కరిగిపోయి
మూసి నవ్వ బూగమెల్ల

నువ్వు నిలిచిన చోటేదో
వెల ఎంత పలికెనో
నువ్వు నడిచే బాటంతా
మంచల్లే అయ్యెనో
నాతోటి రా ఇంటి వరకు
నా ఇల్లే చూసి నన్ను మెచ్చు

ఈమె ఎవరో ఎవరో తెలియకనే
హా వెనకే నీడై పోవద్దే
ఇది కలయో నిజమో ఏ మాయో
నా మనసే నీకు వసమాయే
వసమాయే…

నాలోనే పొంగెను నర్మద
నీళ్ళల్లో మురిసిన తామర
అంతట్లో మారేను ఋతువుల
పిల్లా నీవల్లా..

నీతో పొంగె వెల్లువ
నీళ్ళల్లో ఈదిన తారక
బంగారు పువ్వుల కానుక
పెరెలే కాంచన

కంటి నిద్రే దోచుకెళ్ళావ్
దోచుకెళ్ళావ్…
ఆశలన్నీ చల్లి వెళ్ళావ్
నిన్ను దాటి పోతువుంటే
పోతువుంటే…
వీచే గాలి దిశలు మారు

ఆగంటూ నీవంటే
నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్ని
వసివాడవు ఏనాడు
కౌగిలింతే కోరలేదు
కొరితే కౌగిలి కాదు

నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువ్వు లేవు లేవు అనుకుంటే
నా హృదయం తట్టుకోలేదే

నాలోనే పొంగెను నర్మద
నీళ్ళల్లో మురిసిన తామర
అంతట్లో మారేను ఋతువుల
పిల్లా నీవల్లా..

నీతో పొంగె వెల్లువ
నీళ్ళల్లో ఈదిన తారక
బంగారు పువ్వుల కానుక
పెరెలే కాంచన

ఓ శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే

Song Credits:
Song Name: Nalone Pongenu Narmada
Movie Name: Surya S/o Krishnan
Music Director: Harris Jayaraj
Lyricist: Veturi Sundararama Murthy
Singers: V.V. Prassanna, Harish Raghavendra & Devan Ekambaram
Starring: Suriya, Sameera Reddy