బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వ లాగ నువ్వు వాలితే
బాగుంటుంది నిన్ను తాకికే
బాగుంటుంది నువ్వు అపితే
బాగుంటుంది కంటి కున్న
కాటుకంత ఒంటికంటితే

అహహ హహ బాగుంది వరస
నీ మీద కోపం ఎంతుందో తెలుసా
లాలిస్తే తగ్గిపోతుంది బహుసా
ఈ మనసు ప్రేమ బానిస

ఐతే బుజ్జగించుకుంటానే
నిన్నే నెత్తి నెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలి చూపవే

తడి చేసేద్దాం పెదవులని
ముడి వేసేద్దాం మనసులని
దాచేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయినీ

కాదంటానేంటి చూస్తూ నీ చోరవా
వద్దన్నకొద్ది చేస్తావు గొడవ
నీ నుంచి నేను తప్పుకోడం సులువ
కౌగిల్లలోకి లాగవా

అమ్మో నువ్వు గడుసుకదా
అన్నీ నీకు తెలుసు కదా
ఐనా బయట పడవు కదా
పదా పదా ఎంతసేపిలా

వెలి వేసేద్దాం వెలుతురుని
పరిపాలిద్దాం చీకటిని
పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమనీ

నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చిందరవందరలు
అందంగా సర్దుతూ నా ముంగురులు
మూసావు అన్ని దారులూ

కొంచెం వదిలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవా వెన్నెలా
వేరే దారిలేక నేనిలా
బందించానే అన్ని వైపులా

బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వ లాగ నువ్వు వాలితే

Song Credits:
Movie: Atithi Devobhava
Singers: Sid Sriram, Nutana Mohan
Lyrics: Bhaskara Bhatla
Music: Shekar Chandra
Starring: Aadi Saikumar, Nuveksha Vaishnavi