నిను చూస్తే ఉంటే
కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపుల పైనే
రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుడ్నే
కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే
కాదంటున్నావే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమయెనే
అన్నిటికీ ఎపుడు ముందుండే నేను
నీ యెనకే ఇపుడు పడుతూ ఉన్నాను
ఎవ్వరికి ఎపుడు తలవంచని నేను
నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను
ఇంత బతుకు బతికి నీ
ఇంటి చుట్టు తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు
చాలనుకున్నానే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏల్లు వచ్చాయ చాలు
నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు
ఎర్ర చందనం చీర కడితే
రాయి కుడా రాకుమారే
ఏడురాళ్ళ దుద్ధులు పెడితే
ఎవతైనా అందగత్తె ఐనా
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమయెనే
Album: Pushpa – The Rise (Telugu)
Vocals: Sid Sriram
Songwriter: Chandrabose
Music: Devi Sri Prasad
