ఇంతకన్న మంచి పొలికేది
నాకు తట్టలేదు కానీ అమ్ము
ఈ ప్రేమ అనేది బబుల్ గమ్ము
అంటున్నాదంటే పొదు నమ్ము

ముందునుంచి అందరన్నమాటేగాని
మళ్ళీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
ప్రేమనాపాలేవు నన్ను నమ్ము

ఎట్టగా అనే ఎదురు చూపుకి
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరేయ్ దేవుడా ఇదేందనేంత లోపటే
పిల్లడా అంట దగ్గరై
నన్ను చేరదీస్తివే

బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగికే అట్ట బొమ్మై
జంట కట్టూకుంటివే
బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగికే అట్ట బొమ్మై
జంట కట్టూకుంటివే

మల్టీప్లెక్స్‌లోని ఆడియన్స్ లాగా
మౌనంగున్న గాని అమ్ము
లోన డండనక జరిగిందే నమ్ము
దిమ్మ తిరిగినాదే మనసు సిమ్ము

రాజుల కాలం కాదు
రథము గుర్రం లేదు
అద్దం ముందర నాతో నేనే
యుద్ధం చేస్తాంటే

గాజుల చేతులు చాపి
దగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చీటికేసి
చక్రవర్తిని చేసావే

చిన్నగా చినుకు తుంపరడిగితే
కుండపోతగా తూఫానుదెస్తివే
మాటగా ఓ మల్లె పువ్వునడిగితే
మూటగా పూల తోటగా
పైనొచ్చి పడితివే

బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగికే అట్ట బొమ్మై
జంట కట్టూకుంటివే
బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా
నన్ను సుట్టుకుంటివే
జిందగికే అట్ట బొమ్మై
జంట కట్టూకుంటివే

ఇంతకన్న మంచి పొలికేది
నాకు తట్టలేదు కానీ అమ్ము
ఈ ప్రేమ అనేది బబుల్ గమ్ము
అంటున్నాదంటే పొదు నమ్ము

ముందునుంచి అందరన్నమాటేగాని
మళ్ళీ అంటున్నానే అమ్ము
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
ప్రేమనాపాలేవు నన్ను నమ్ము

Song: ButtaBomma
Singer: Armaan Malik
Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry
Movie Ala Vaikuntapuramulo
Audio: Aditya Music